పొదుపును అలవాటుగా చేసుకుంటే, మదుపు చేయడానికి అదే ఇంధనంగా మారుతుంది. క్రమం తప్పకుండా చేసే మదుపు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. అయితే ఎక్కువ డబ్బును కూడబెట్టడమే ఆర్థిక స్వేచ్ఛ అని ఆలోచించేవారు దాని కోసమే ఆరాటపడుతూ ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. డబ్బును అవసరాల కోసమే చూసేవారికే ఆర్థిక స్వేచ్ఛ సొంతమవుతుంది.