JN: ప్రజలు ఐక్యంగా ప్రశాంతంగా నిమజ్జనాలు జరుపుకోవాలని వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజా మహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. జనగామలోని ఏసి రెడ్డి నగర్లో నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొని వారు మాట్లాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండి చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ కనబరచి సమాజహితం కోసం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఐ పాటు తదితరులున్నారు.