SDPT: జిల్లా కార్యాలయ సముదాయంలో శనివారం గ్రామ పాలన అధికారుల కౌన్సెలింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ K. హైమావతి, అ. కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్ కలిసి నిర్వహించారు. జీపీఓ పరీక్షలో ఫేస్-1, ఫేస్-2లో ఎంపికైన 149 మందికి నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించినట్టు కలెక్టర్ తెలిపారు.