ఇటీవల 8 వసంతాలు మూవీతో అందరి మన్ననలు పొందిన హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ తన చదువుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి ఉందని, ఆ మార్గంలోకి అడుగుపెట్టేముందే మన చట్టాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నట్లు తెలిపారు. అందుకే ప్రస్తుతం లా(LAW) చదువుతున్నానని చెప్పారు. మొదట్లో ఇండస్ట్రీలోకి రావాలా వద్దా అని చాలా ఆలోచించానని పేర్కొన్నారు.