MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం నేడు (ఆదివారం) చంద్రగ్రహణం ఉన్నందున మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తుల దర్శనానికి తెరిచి ఉంటుందని EO బాపురెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేసి, సోమవారం ఉదయం 6 గంటలకు శుద్ధి, సంప్రోక్షణ, అభిషేకాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని ఆయన తెలిపారు.