JGL: మెట్‌పల్లిలోని వట్టి వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్లను శనివారం కలెక్టర్ సత్యప్రసాద్ ఆర్డీవో శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత.. ప్రజలందరూ సమన్వయంతో, శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకోవాలని సూచించారు. గణేష్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసామన్నారు.