ఇటీవల భారత్‌పై US అధిక సుంకాలు విధించడంతో విభేదాల వేల మోదీ, ట్రంప్ మరోసారి సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. మలేషియాలో అక్టోబర్‌లో జరగనున్న ASEAN సమ్మిట్‌కు ట్రంప్ హాజరుకానున్నట్లు ఆ దేశ ప్రధాని స్పష్టం చేశారు. అయితే మలేషియాకు మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ అక్కడ మోదీ, ట్రంప్ భేటీ అవుతారని ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.