MDK: జిల్లాలో ఆయిల్ పామ్ సాగును పెంచాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ బాషా సూచించారు. ప్రభుత్వం ఈ సాగుకు భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోందని ఆమె తెలిపారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చిన్న గొట్టుముక్కల గ్రామంలో రైతు నరసింహారావు పొలంలో జరిగిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆమె కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కలిసి పాల్గొన్నారు.