TG: నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(NFIR) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డా.మర్రి రాఘవయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జాతీయ మహాసభల్లో రాఘవయ్యను ఎన్నుకున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. NFIR దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యదర్శిగా భరణి భానుప్రసాద్తో పాటు వర్కింగ్ కమిటీ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు.