SKLM: తీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మత్స్యకారులకు రాయితీపై 25 ఇంజన్లు, వలలు, ఇతర వేట పరికరాలు పంపిణీ చేశారు. రాయితీపై పరికరాలు అందజేసిన కూటమి ప్రభుత్వానికి మత్స్యకార ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.