MDK: క్రీడ పోటీలలో గెలుపోటములు సహజమని పాపన్నపేట ఎంఈవో ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. పాపన్నపేట ZPHS క్రీడా మైదానంలో 3 రోజులు ఎస్జీఎఫ్ పోటీలను నిర్వహించారు. శనివారం ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది అన్నారు. కబడ్డీలో పాపన్నపేట, ఖోఖోలో కుర్తివాడ ప్రథమ స్థానంలో నిలవగా వారికీ బహుమతులు అందజేశారు. హెచ్ఎం మహేశ్వర్, ఉన్నారు.