MNCL: సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని మూసివేయనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన, అనుబంధ దేవాలయాలను మూసివేస్తామన్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు సంప్రోక్షణ అనంతరం దేవాలయాన్ని తిరిగి తెరుస్తామనీ, అందరూ గమనించాలన్నారు.