MDK: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(NMMS) ఉపకార వేతనాల కోసం అక్టోబర్ 6వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ వసతి లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. దరఖాస్తులను www.bse.telangana.gov.inలో చేసుకోవాలన్నారు.