శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా సింహాచలం వద్ద ట్రాక్‌పై మరమ్మతు పనులు కారణంగా పలాస-విశాఖపట్నం(67290) మెము ప్యాసింజర్ రైలు ఆదివారం విజయనగరం వరకే నడుస్తుందని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ రైలు జిల్లాలో ప్రధాన స్టేషన్లు అయినా పలాస, నౌపాడ, కోటబొమ్మాలి, శ్రీకాకుళం, దూసి, పొందూరు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.