SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టులో ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 24,130 క్యూసెక్కుల వరద నేడు కొనసాగుతోంది. ప్రాజెక్టు పటిష్టత కోసం అధికారులు నిర్దేశించిన ప్రకారంగా స్టోరేజీ పరిమితి మించకుండా ప్రాజెక్టు 2 గేట్ల ద్వారా 22,212 క్యూసెక్కుల జలాలు బయటకు విడుదలవుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 29.917 TMCలు కాగా 16.525 TMCల వద్ద నిల్వ ఉంది.