ప్రకాశం: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా కనిగిరి పట్టణానికి చెందిన ఎనుముల మారుతి ప్రసాద్ రెడ్డిని నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది. గతంలో ప్రసాద్ రెడ్డి PDCC ఛైర్మన్గా పనిచేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రసాద్ రెడ్డి తెలిపారు.