GNTR: బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేసి ఉంటాయని, ఈ సమయంలో భక్తులకు దర్శనం ఉండదని పేర్కొన్నారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరిగి దర్శనానికి అనుమతిస్తామన్నారు.