TG: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్ద గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సాగర్ చుట్టూ 40 క్రేన్ల ద్వారా నిమజ్జనాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల తర్వాత విగ్రహాల తాకిడి పెరిగింది. బషీర్బాగ్ వైపు నుంచి శోభాయాత్ర నెమ్మదిగా కదులుతోంది. ఇంకా వందలాది విగ్రహాలు రావాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2.61 లక్షల విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు చెప్పారు.