SRPT: మునగాల మండలం జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భరత్ బాబు శనివారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. వృత్తిపట్ల నిబద్ధత, అంకిత భావంతో పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లా అధికారులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల తొమ్మిదిన సూర్యాపేటలో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో భారత్ బాబు ఈ అవార్డును అందుకోనున్నారు.