JN: జనగామ జిల్లా సాధనకై చేసిన ఉద్యమాల్లో బాగంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టిన కేసు విషయంలో ఉద్యమకారులు నేడు జనగామ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. జిల్లా సాధనలో ఆనాడు ఎన్నో పోరాటాలు చేసి జిల్లాను సాధించామని, చేసిన పోరాటం వృథా కాలేదు అని తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో నూతన జిల్లా కోసం ఉద్యమాలు చేశామన్నారు. వీరికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి వారికి సంఘీభావం పలికారు.