KMM: ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూసుమంచి(M) శనివారం చోటుచేసుకుంది. SI నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మునిగేపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సిద్ధు ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించిన యువతి ప్రేమను కాదనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండి హుస్సేన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.