NLR: కందుకూరు సబ్ కలెక్టరేట్లో శనివారం గిరిజనుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరేడు భూ సేకరణ పై నిరసనలు ప్రతిధ్వనించాయి. కరేడు లోని రామకృష్ణాపురం గిరిజన కాలనీని ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమని స్థానికులు స్పష్టం చేశారు. 30 పోలీస్ యాక్ట్ నిర్బంధాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల అభ్యర్థనను పట్టించుకోవడం లేదని తెలిపారు.