ADB: తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన తొగరి తిరుపతి-మమత దంపతుల కుమారుడు రిశీత్ తన ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. అదే గ్రామంలోని MPPS పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రిశీత్ దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లను చకాచకా చెప్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. రిశీత్ పట్టుదల, జ్ఞాపకశక్తి పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.