HYD: గణపతి నిమజ్జనం వేళ HYD మెట్రో, MMTS సేవలు పొడిగిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు సేవలు ఉంటాయి. రేపు ఉదయం 4.40 గంటల వరకు MMTS రైళ్లు తిరగనున్నాయి. సికింద్రాబాద్ – ఫలక్నామా, సికింద్రాబాద్-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్నామా, ఫలక్నామా-సికింద్రాబాద్ మధ్య 8 MMTS రైళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.