KMR: దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని రోటరీ క్లబ్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డిలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన నేషన్ బిల్డర్స్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎల్లయ్య, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.