WGL: నర్సంపేటలో శనివారం ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో మాజీ పోలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ విజయ్ శంకర్ ఝా మృతి పట్ల సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళి అర్పించి వారు చేసిన పోరాటాలను కొనియాడారు. వారి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, రాగసుద పాల్గొన్నారు.