SDPT: ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో మండల కేంద్రంలోని బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రెడ్డి ఆలయ కమిటీ ఛైర్మన్ జెల్ల ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆలయాన్ని మూసివేసి తిరిగి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తెరువబడుతుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.