వేటపాలెంలోని రైల్వే స్టేషన్ ఏరియా నందు శనివారం బాలుడు అర్థం కాని పరిస్థితిలో తిరుగుతుండగా పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఎస్సై జనార్ధన్ బాలుడి ఫోటోను గ్రూపుల్లో పెట్టి ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులు వెంకటలక్ష్మి శ్రీనులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా బాలుడు తల్లిదండ్రులు ఎస్సైకు కృతజ్ఞతలు తెలిపారు.