NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో కల్లేపల్లి గ్రామంలోని బంగారు మైసమ్మ తల్లి ఆలయ మాజీ ఛైర్మన్ ధీరావత్ భాషా నాయక్ ఇటీవల జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడ్డారు. మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతున్న భాషా నాయక్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పరామర్శించారు. ఆయన వెంట దుర్గంపూడి నారాయణరెడ్డి, ధనావత్ బాలాజీ ఉన్నారు.