SKLM: నరసన్నపేట మండలంలో ఎరువుల పంపిణీ ప్రక్రియను నరసన్నపేట నియోజకవర్గ ప్రత్యేక అధికారి జి.జయ దేవి పరిశీలించారు. శనివారం నరసన్నపేట మండలం జమ్మూ రైతు సేవ కేంద్రాన్ని ఏవో సూర్య కుమారితో కలిసి పరివేక్షించారు. ఆమె మాట్లాడుతూ.. మండలంలో రైతు సేవ కేంద్రాలకు 467 మెట్రిక్ పన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. యూరియాను సక్రమంగా అందించాలని ఆదేశించారు.