KNR: స్వయం సహాయక సంఘాల్లో పదవ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ తెలంగాణ ఓపెన్ స్కూల్లో చేర్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. మెప్మా, డీఆర్డీవో అధికారులు, సిబ్బందితో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్లోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు.