CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. బ్రహ్మోత్సవాలు కావడంతో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లో నిండిపోయాయి. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు. స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.