ELR: కలకత్తా నుండి హైద్రాబాద్‌కి కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 12,100 కేజీల గోవు మాంసాన్ని శనివారం జీలిగుమిల్లి పోలీసులు పట్టుకున్నారు. గ్రామ శివారులో ఉన్న హెచ్.పీ గ్యాస్ గోడౌన్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వస్తున్న కంటైనర్‌ను తనిఖీ చేయగా గోవు మాంసం అక్రమ రవాణాను గుర్తించారు. లారీలో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.