MBNR: జిల్లా కెమిస్ట్&డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రశాంత్ గెలుపొందారు. జిల్లా కేంద్రంలోని సుదర్శన్ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తన సమీప అభ్యర్థి పుల్ల శ్రీనివాస్‌పై గెలుపొందినట్టు ఎన్నికల అధికారి వెల్లడించారు. సెక్రటరీగా రామ్మోహన్, ట్రెజరర్‌గా రాఘవేందర్ గెలుపొందారు.