MDK: నర్సాపూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. గత పది రోజులుగా యూరియా లభించకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రెండు లారీల యూరియా రావడంతో విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున యూరియా బస్తా కోసం ఎగబడ్డారు. పోలీసు పహారా మధ్య రైతులకు టోకెన్లు పంపిణీ చేసి ఒక్కరికి ఒక్క బస్తా చొప్పున అందించారు.