SKLM: జలుమూరు మండలంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ఆకస్మికంగా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. శనివారం సాయంత్రం మండలంలోని జలుమూరు, సైరిగాం పీహెచ్సీ కేంద్రాలలో పరిశీలించిన ఆయన రోగులకు అందుతున్న వివిధ సేవలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా రోగులకు వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి ప్రసవాలకు ప్రోత్సహించాలన్నారు.