NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి అమ్మవార్ల పవిత్రోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం చతుస్థానార్చన-వేద,దివ్య ప్రబంధ పారాయణలు విశేషహోమము, నివేదన, శాతూమురై, చతుస్థానార్చన-వేద,దివ్య ప్రబంధ పారాయణలు విశేషహోమము, తిరుచ్చి ఉత్సవం ఘనంగా జరిగాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.