AKP: వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా శనివారం నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లి వాసవి క్లబ్, వనిత సౌగంధిని ఆధ్వర్యంలో పాత్రికేయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఎస్ జే.నరేష్ మాట్లాడుతూ.. సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. తాము ఈరోజు పాత్రికేయలను సన్మానించడం జరిగిందని చెప్పారు.