మహారాష్ట్రలో దారుణం జరిగింది. పాల్ఘర్ జిల్లా బిబల్ధర్ గ్రామంలోని మైనర్ బాలికతో నీలేష్ దోంగ్డాకు పెళ్లి నిశ్చయమైంది. అయితే బాలిక తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లోకి దూరి పెళ్లికి ముందే తనతో శృంగారం చేయాలని అతను బలవంతం చేశాడు. దానికి బాలిక ఒప్పుకోకపోవడంతో అత్యాచారం చేసి, హత్య చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నీలేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.