MDK: మనోహరాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద శనివారం ఎంపీటీసీ/ జడ్పీటీసీ ఓటర్ జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసినట్లు ఎంపీడీవో రవీందర్ తెలిపారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్లో ఏడు ఎంపీటీసీ స్థానాలు, 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. డ్రాప్ ఓటరు జాబితా పబ్లికేషన్పై అభ్యంతరాలను సోమవారం సాయంత్రంలోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.