AP: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. సీడాప్ ద్వారా ఐదేళ్లలో 50 వేలమందికి విదేశీ ఉద్యోగాలే లక్ష్యమన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. ఇకపై చదువుతోపాటే విదేశీ భాషల్లో శిక్షణా ఇచ్చేలా చర్యలు చేపడతామని వ్యాఖ్యానించారు.