KDP: అట్లూరు మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి పొడమేకల ధనుష్ శుక్రవారం నుంచి కనిపించడంలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం స్కూల్కు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పారు. ఈ మేరకు చుట్టుపక్కల ఎంతో వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. కాగా, ఫోటోలో కనిపిస్తున్న బాలుడిని ఎక్కడైనా చూసిన వారు సమాచారం అందించాలని ధనుష్ తండ్రి రమణ తెలిపారు.