SKLM: మందస గ్రామంలోని ఎరువుల దుకాణాలను పలాస సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం.రామారావు, మందస మండల వ్యవసాయ అధికారి జి.నాగరాజులు శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎరువుల దుకాణాలలో స్టాక్ వివరాలు, రికార్డులు, లైసెన్సులు,ధరల అమ్మకాలను పరిశీలించారు. ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించిన, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించిన శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.