కృష్ణా: యూరియా పంపిణీ కార్యక్రమాల్లో కూటమి నాయకులు పాల్గొని విమర్శలకు తావివ్వవద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రైతుకు యూరియా అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో యూరియా విక్రయాలు సజావుగా నియమ నిబంధనల ప్రకారం జరిగేలా కృషి చేస్తున్న అధికారులకు కూటమి నాయకులు సహకరించాలని కోరారు.