BHNG: రామన్నపేట మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు పెంటయ్య డిమాండ్ చేశారు. ఈరోజు సీపీఎం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి అలీఖాన్‌కు వినతి పత్రం అందజేశారు. యూరియా అందుబాటులో ఉంచడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.