NZB: సీఎం సహాయనిధి పేదలకు వరంలా మారిందని ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. శనివారం ఆర్మూర్ పట్టణంలో బాధితునికి రూ. 60 వేల CMRF చెక్కును అందజేశారు. ముఖ్య మంత్రి సహాయనిధి వల్ల పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతొందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.