TPT: సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ తల్లి ఆలయం నందు ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా అమ్మవారి దర్శనం నిలిపివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రసన్న లక్ష్మి తెలిపారు. ఇందులో భాగంగా 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 8వ తేదీ ఉదయం 9 గంటల వరకు నిలిపివేయనున్నట్లు చెప్పారు. అనంతరం 9 గంటల తరువాత ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారన్నారు.