ADB: అందరి సమిష్టి కృషితోనే ప్రభుత్వ పాఠశాలల బలోపేతం సాధ్యమని మండల విద్యాశాఖ అధికారి రాధాకృష్ణారెడ్డి పేర్కొన్నారు. భీంపూర్ మండలంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాధాకృష్ణారెడ్డిని మండల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.