HYD: గణపతి నిమజ్జనం వేళ సెప్టెంబర్ 7వ తేదీన HYD మెట్రో సేవలు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. రేపు రాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీస్ అందిస్తామని తెలిపింది. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రయాణికుల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నారు.