ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గుండమాల తీరంలో నిమజ్జనోత్సవం సందర్భంగా మృతి చెందడంపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోటు మాల గ్రామానికి చెందిన నాగరాజు, పాలచందర్లు తీరంలో కొట్టుకు వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సమాచారం తెలుసుకున్న దామచర్ల వెంటనే మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీశారు.